కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి

85చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేటలో సోమవారం ఆశ వర్కర్లు మున్సిపల్ పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. కనీస వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని, ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలన్నారు. కలెక్టరేట్ అధికారికి వినతి పత్రం అందించారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్