ప్రభుత్వం ఈ నెల 26న ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కొత్త పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారందరిని ఎంపిక చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్ సూచించారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్ లో జిల్లాలోని తహసీల్దార్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని అన్నారు.