అఖిల భారత యాదవ మహాసభ నారాయణపేట మండల నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు శశికాంత్ యాదవ్ తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా బస్సప్ప యాదవ్, అధ్యక్షుడు చందు యాదవ్, ఉపాధ్యక్షులు బాలప్ప యాదవ్, చెన్నప్ప, పెంటప్ప యాదవ్, ప్రధాన కార్యదర్శి గోవింద్ యాదవ్, కార్యదర్శులు మల్లేష్ యాదవ్, వెంకటప్ప యాదవ్, నర్సింలు యాదవ్, యువజన విభాగం అధ్యక్షుడుగా నరేష్ యాదవ్ లను ఎన్నుకున్నామని చెప్పారు.