వసతి గృహాలను సందర్శించిన సంక్షేమ శాఖ అధికారి

71చూసినవారు
వసతి గృహాలను సందర్శించిన సంక్షేమ శాఖ అధికారి
నారాయణపేట పట్టణంలోని బీసీ బాలికలు, బాలుర వసతి గృహాలను బుధవారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి సందర్శించారు. వసతి గృహం పరిసరాలను, వంట గదులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, రికార్డు పుస్తకాలు అందజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్