దామరగిద్ద మండల కేంద్రం శివారులో శనివారం సాయంత్రం టిప్పర్ వాహనం ద్విచక్ర వాహనం ఢీకొని వివాహిత మృతి చెందింది. రోడ్డు ప్రమాదంలో నారాయణపేట కు చెందిన రేఖ మిస్కిన్(35) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త శంకర్ కు గాయాలు కాగా, స్థానికులు గమనించి నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.