వెల్దండ మండలం ఏజీ కాలనీ తండాలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగుల చేతిలో రత్నావత్ రాజు అనే యువరైతు హత్యకు గురయ్యాడు. యువరైతు రాత్రి పంట చేను కావలి కోసం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి అక్కడే నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా గొంతు కోసి హత్య చేశారని గ్రామస్తులు తెలిపారు. రత్నావత్ రాజు హత్యతో ఏజీ కాలనీ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.