దొంగతనం కేసులో నిందితులకు 32 నెలల జైలు శిక్ష విధిస్తూ ఫస్ట్ అడిషనల్ జడ్జి శ్రీలత గురువారం తీర్పు ఇచ్చినట్టు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. వీపనగండ్ల మండలం తూముకుంటలో బి. ఎల్లమ్మ పుస్తెలతాడు చోరీ జరిగిందని 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ రాము, యం. గోపాలకృష్ణ, యం. వెంకటయ్యలను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరచగా నేరం రుజువు కావడంతో 32 నెలల జైలు శిక్ష, రూ. 400ల జరిమాన విధించారు.