జూరాల ప్రాజెక్టుకు సోమవారం రాత్రి 9 గంటల వరకు ప్రాజెక్టుకు 68, 000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టు 5 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 35, 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో ఒక పంపును ప్రారంభించారు. విద్యుదుత్పత్తి కోసం 37, 115 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 75, 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.