గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వనపర్తి జిల్లా మదనాపూర్ మండలం దుపల్లి గ్రామంలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయాయి. కనీసం బాధితుల గోడు వినే పరిస్థితి కూడ గ్రామంలో కనిపించడం లేదు. ప్రభుత్వం నుండి వారికీ భరోసా కల్పించి సహాయం చేసే వారే కరువు అయ్యారు. దీంతో తమకు ప్రభుత్వం ఆదుకోవాలని, తమకు నష్టపరిహారం అందజేయాలని బాధితులు కోరుతున్నారు.