టూవీలర్ పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసుల వివరాల ప్రకారం. వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన పాపయ్య ఎబిడి కంపెనీలో లారీ నిలిపి బైక్ పై ఎర్రవల్లి వెళ్లేందుకు రాత్రి రంగాపూర్ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ శివారులో కర్నూల్ వైపు వెళ్తున్న స్కోర్పియో వాహనం వేగంగా వచ్చి ఢీ కొనడంతో మృతిచెందాడు.