కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 లక్షల రైతు రుణమాఫీ విజయవంతం చేసేందుకు వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లేల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న అయనకు రైతులు బ్యాంక్, వ్యవసాయ అధికారులు సహకరిస్తాలేరని తెలుపగా జిల్లా వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి రైతులకు బ్యాంక్, వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.