వనపర్తి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వరి ధాన్యం కొనుగోలుపై అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సమీక్ష నిర్వహించారు. ఈ సారి సన్నరకం వడ్లకు ప్రభుత్వం ద్వారా క్వింటాలుకు రూ. 500/- అదనంగా ఇస్తున్నందున జిల్లాలో భారీగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అందుకు తగ్గ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.