ప్రయాణికుల సమస్యలపై ఆర్ఎంకు బిజెపి వినతి

53చూసినవారు
ప్రయాణికుల సమస్యలపై ఆర్ఎంకు బిజెపి వినతి
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఆఫీస్ లో వనపర్తి బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. పట్టణ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ మాట్లాడుతూ. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో మూత్రశాలలు, కుర్చీలు లేకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. బస్టాండ్లలో అన్ని సౌకర్యాలు, బస్సుల సంఖ్య పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్