వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని 14వ వార్డులో మదనపురం రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫారం కు తగిలి గేదె మృతి చెందింది. ఎలాంటి కంచె లేకపోవడం వల్లనే జరిగిందని స్థానికులు అంటున్నారు. గతంలో ఈ విషయంపై విద్యుత్ శాఖ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పేద రైతుకు సంబంధించిన గేదె చనిపోవడంతో గేదె పాలు అమ్మి జీవనోపాధి పొందుతున్న ఒక రైతు తన జీవనోపాధిని కోల్పోయాడని స్థానికులు తెలిపారు.