డి. శ్రీనివాస్ మృతి పట్ల చిన్నారెడ్డి సంతాపం

59చూసినవారు
డి. శ్రీనివాస్ మృతి పట్ల చిన్నారెడ్డి సంతాపం
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని శనివారం వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. రాజకీయ దురంధరుడు, ఉన్నత విద్యావంతుడు అని, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని తెలిపారు. శ్రీనివాస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్