అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కు ఎవరు స్పందించవద్దని ఆత్మకూరు ఎస్ఐ నరేందర్ తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలోని బస్సు స్టాండ్ దగ్గర సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ. వాట్సప్ గ్రూపులలో వచ్చే ఏపీకే ఫైల్స్ ని మన ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవద్దు. మీకు లాటరీ తగిలిందని మీ అకౌంట్ కు సంబంధించిన వివరాలు అడిగితే చెప్పొద్దని సూచించారు.