రైతు రుణమాఫీ అవ్వని రైతులు అపోహ పడొద్దని గురువారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. కుటుంబ నిర్ధారణ కానీ రైతుల ఇళ్లకు వ్యవసాయశాఖ సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. రైతుల ఇంటి వద్దే కుటుంబ నిర్ధారణ చేసి వివరాలు యాప్లో అప్ లోడ్ చేస్తారన్నారు. గత ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీపై కాగ్ నివేదికలో వాస్తవాలు వెల్లడయ్యాయన్నారు. రైతులను గందరగోళం చేసే పనులు చేయొద్దని హితవు పలికారు.