సాయిచంద్ కు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి

83చూసినవారు
సాయిచంద్ కు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి
మలిదశ ఉద్యమ నాయకుడు గాయకుడు తెలంగాణ గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ దివంగత వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి సభ రంగారెడ్డి జిల్లా హస్తినపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరై సాయిచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. అనంతరం బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్