ఉపరితల ఆవర్తనం కారణంగా సోమ, మంగళవారం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-50కి. మీ గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులలో రుతుపవనాలు రాష్ట్రానికి రానున్నాయి.