వర్షానికి కూలిన ఇల్లు

79చూసినవారు
వర్షానికి కూలిన ఇల్లు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పిల్లికుంట తండాలో కేతావత్ రాకేష్ కు చెందిన ఇల్లు వర్షానికి ఆదివారం కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఇద్దరు పిల్లలతో నిద్రిస్తున్న రాకేష్ భార్య జయకు స్వల్ప గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన వెంకటేష్ నాయక్ ఫోన్ ద్వారా గ్రామ కార్యదర్శి పార్వతికి సమాచారం అందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి గ్రామానికి చేరుకొని కూలిన ఇంటిని పరిశీలించి, ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె చెప్పారు.

సంబంధిత పోస్ట్