వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురుపూజోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు పలువురిని ఆకట్టున్నాయి. వేదికపై చిన్నారులు సంప్రదాయ పాటలకు అద్భుతమైన నృత్యం చేసి అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, అధికారులు, తదితరులు, పెద్దయెత్తున పాల్గొని ఆసక్తిగా తిలకించారు.