వనపర్తి జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం హక్కుల సాధనకై ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "జనభేరి" పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు. రాచాల మాట్లాడుతూ. గత 15 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని, గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమ కేసులు పెట్టినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనేక ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశామన్నారు.