కొత్తకోట శివారులోని వెంకటగిరి క్షేత్రంలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణ అంతా కిటకిటలాడుతోంది. నారాయణుడి నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికశోభను సంతరించుకున్నది. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లలో భక్తులు బారులు తీరారు. ఇందుకు తగినట్లుగా వెంకటగిరి అభివృద్ధి కమిటీ ఏర్పాట్లు చేశారు.