సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు అంకితమవుదామని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కార్యాలయంలో పూలే జయంతి సందర్భంగా గురువారం చిత్రపటానికి మాల వేసి నివాళి అర్పించారు. జిల్లా నేతలు కళావతమ్మ మాట్లాడుతూ. బడుగుల కోసం బడులు తెరిచి, స్త్రీ విద్య కోసం భార్య తొలి టీచర్ ను చేశారని, మనువాదాన్ని ప్రతిఘటించారన్నారు. గోపాల కృష్ణ, రమేష్, పల్లవి, ఎర్రకుర్మయ్య, నరేష్, కొండన్న, రాంబాబు, మహేష్ పాల్గొన్నారు.