పెద్దమందడి: బుద్ధారం రైట్ కెనాల్ పామిరెడ్డిపల్లి గ్రామ శివారు నుంచి దొడగుంటపల్లి, చిన్నమందడి గ్రామాలకు సాగునీరు అందించేందుకు కావలసిన పంట కాలువ ఏర్పాటుకు శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆయా గ్రామాల రైతులతో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు. ఈ కాలువ ఏర్పాటుతో పలు కుంటలకు సాగునీరు చేరుతుందని, దాంతో 300పై చీలుకు ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ కాలువ ఏర్పాటుకు పెద్దమనుసుతో రైతులు సహకరించాలని సూచించారు.