శ్రీరంగనాయక స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి

56చూసినవారు
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొని శ్రీరంగ నాయక స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గ ప్రజలకు శ్రీరంగనాయక స్వామి ఆశీస్సులు ఉండాలని, రూ. కోటి 50లక్షలతో మినీ ట్యాంక్ బండ్, చరిత్రక దేవాలయం చుట్టూ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్