వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురంమండల కేంద్రం శివారులోని శేషావులు గుట్టపై ఉన్న దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా శనివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గంధం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దర్గాలో ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు, మండల నాయకులు సాయి చరణ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ శెట్టి, లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.