నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి: సిపిఐ

78చూసినవారు
నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి: సిపిఐ
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సీపీఐ వనపర్తి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, రమేష్, గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ. కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కల్తీ, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్