సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం ఈనెల 15 నుండి 26 వరకు వనపర్తి నుండి కాలేశ్వరానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేసినట్లు వనపర్తి డిఎం వేణుగోపాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సూపర్ లగ్జరీ బస్సుకు రూ. 2320, డీలక్స్ కు రూ. 2040 పోను రాను టికెట్ ఛార్జీగా నిర్ణయించినట్టు తెలిపారు. ఆసక్తి కల భక్తులు/ప్రయాణికులు బస్సు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.