వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్లలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్న పలుస. శంకర్ గౌడ్ కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా విద్యాశాఖకు ఆయన అందించిన సేవలకు గాను ఈ పురస్కారం లభించింది. గురువారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకొనున్నారు.