వనపర్తి జిల్లా కేంద్రంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా వ్యతిరేకంగా పాఠశాల నడుపుతోందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలకృష్ణ తెలిపారు. శనివారం ఏబీవీపీ నాయకులు పాఠశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ పై కఠినచర్యలు తీసుకోవాలని ఢిల్లీ వరల్డ్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.