వనపర్తి జిల్లా కేంద్రంలో గురుపూజోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ముఖ్యఅతిధులుగా హాజరై మాట్లాడుతూ. డా. సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తిగా ఉత్తమ సమాజాన్ని నిర్మించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా నుండి ఉత్తమ ఉపాద్యాయులుగా ఎంపికైన 52 మంది ఉపాధ్యాయులను సన్మానంచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లలు చిన్నారెడ్డి పాల్గొన్నారు.