ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడేనే మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్ఐ మంజునాథ రెడ్డి వివరాల ప్రకారం. కొత్తకోట మండలం మమ్మలపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి(44)పై ఆగి ఉన్న లారీని కడుకుంట్ల గ్రామానికి చెందిన శ్రీనివాసులు బైక్ పై వెళ్తూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.