అడిషనల్ కలెక్టర్ చీర్ల శ్రీనివాసులకు సన్మానం

55చూసినవారు
అడిషనల్ కలెక్టర్ చీర్ల శ్రీనివాసులకు సన్మానం
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన చీర్ల శ్రీనివాసులు నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గా పదవి విరమణ పొందుతున్న సందర్భంగా వనపర్తి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ శనివారం ఆయనను శాలువాతో సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల్ మాట్లాడుతూ. నిరుపేద కుటుంబంలో జన్మించి కష్టపడి విద్యను అభ్యసించి అంచలంచలుగా ఎదుగుతూ అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగారని అభినందించారు.

సంబంధిత పోస్ట్