వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి సాయి పుతిన్ (15) వాలీబాల్ ఆడుతూ.. అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో మృతిపై విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని శనివారం సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ లో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.