వనపర్తి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో పురుగు మందు తాగి ఓ రైతు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం. గోపాలపేట మండలం ఏదుట్లకు చెందిన సాయిరెడ్డి తన భూమిని సాగు చేయకుండా తన సోదరుడు ఇబ్బంది పెడుతున్నాడని గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఐనా అధికారులు పట్టించుకోలేదన్న మనస్తాపంతో ప్రజావాణిలో పురుగు మందు తాగాడు. అప్రమత్తమైన అధికారులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.