వనపర్తి జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 8, 167 కేసులను పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ఆర్. సునీత తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రజనితో కలిసి లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ. లోక్ అదాలత్ లో ప్రీ లిటిగేషన్ 5, 600, సివిల్ 15, క్రిమినల్ 2, 552, మొత్తంగా 8, 167 కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.