వనపర్తి జిల్లా అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలోని నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని మంగళవారం ఎంపీడీఓ చెన్నమ్మ, స్థానిక ఎస్ఐ బి సురేశ్, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలోని ఒక భాగంలో ఐదు పాఠశాల గదులను నూతన ఎంపీడీఓ కార్యాలయానికి కేటాయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విష్ణు, తిరుమలేష్, వెంకటేశ్వర్ రెడ్డి, రాకేష్ గౌడ్, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.