సంక్రాంతి పండుగకి ఊరెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని వనపర్తి జిల్లా రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి శుక్రవారం సూచనలు చేశారు. లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయాలను సోషల్ మీడియాలో అప్డేట్ చేయవద్దని చెప్పారు. స్వీయ రక్షణకు ఇంట్లో సీసీ కెమెరా అమర్చుకుంటే మంచిదన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 100 కు సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు.