వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేంద్రంలో సోమవారం పతంజలి యువ ప్రభారి శ్రీనునాయక్ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గ్రామ ప్రజల చేత యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా ప్రభారి మాట్లాడుతూ. మాట్లాడారు. జూన్ 21 వ తేదీన యోగాడే ని పురస్కరించుకొని ప్రతిరోజూ ఒక గ్రామాన్ని ఎంచుకొని ఉచిత యోగా సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.