పోలీసులు సమయపాలన పాటిస్తూ క్రమశిక్షణ, నీతినిజాయతీతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. మారుతున్న సమాజానికి అనుగుణంగా పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని అన్నారు.