వనపర్తి: తల్లిదండ్రులు, గురువులు, ఊరును మరువద్దు: ఎమ్మెల్యే

74చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగిన జన్మనిచ్చిన తల్లిదండ్రులను, గురువులను సొంత ఊరిని ఎప్పటికీ మరువకూడదన్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం ఇటీవల విమాన దుర్ఘటనలో మృతి చెందిన మెడికల్ విద్యార్థులకు, మృతులకు ఆత్మశాంతి చేకూరాలని మౌనం పాటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్