వనపర్తి పట్టణంలోని డా. బాలక్రీష్టయ్య క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరంను శుక్రవారం కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తూన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. శిబిరంలో త్రాగడాని మంచినీళ్లు ఏర్పాటు చేయకపోవడంతో క్రీడాకారులు ఇంటి నుంచి తెచ్చుకుoటున్నారని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.