వనపర్తి: జూరాలపై రైతులు ఆందోళన

78చూసినవారు
తమ పంటలకు సాగునీరు ఇవ్వాలంటూ జూరాల ప్రాజెక్టు వద్ద మంగళవారం ఆయకట్టు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో జూరాల డ్యాంపై రెండు వైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సాగునీళ్ల కోసం రైతుల చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళన విరమించాలంటూ పోలీసులు చేసిన విజ్ఞప్తిని రైతులు పట్టించుకోలేదు. దీంతో ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్