వరంగల్ పర్యటనలో ప్రపంచ సుందరి పోటీదారుల కాళ్లను తెలంగాణ మహిళలతో కడిగించడం రాష్ట్రానికి తీవ్ర అవమానకరమని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురువారం ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు, పంటల కొనుగోళ్లను గాలికి వదిలేసి అందాల పోటీలు నిర్వహించడం అవివేకమని విమర్శించారు. అందాల పోటీదారుల వరంగల్ పర్యటన కోసం అక్కడి చిరువ్యాపారుల పొట్టగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.