రైతులు అనేక కష్టాలు పడుతుంటే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించడంలో శ్రద్ధ చూపుతోందని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల ఇబ్బందులపై మాజీ మంత్రి మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులతో రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటను కొనాలని కోరారు.