వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు, మురికి కాలువలను ఆక్రమిస్తూ నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్న రాములు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.