వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన జాన్ వెస్లీ రాష్ట్ర సీపీఎం పార్టీ కార్యదర్శిగా ఎంపికైనట్లు మంగళవారం సీపీఎం పార్టీ వర్గాలు తెలిపాయి. చిన్నప్పటి నుంచి ప్రజా ఉద్యమంలో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేసి మృదు స్వభావిగా ఉన్న జాన్ వెస్లీ ఎంపిక కావడంపై అమరచింత పట్టణ వాసులు అభినందనలు తెలియజేశారు. వివిధ ప్రజా సమస్యలపై జాన్ వెస్లీ నిరంతరం పోరాట చేసే వ్యక్తిగా పార్టీ నాయకులు పేర్కొన్నారు.