వనపర్తి: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

81చూసినవారు
ప్రజా ప్రభుత్వంలో ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట తప్పకుండా నిలబెట్టుకుంటుంది అని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి అన్నారు. శుక్రవారం పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లుకు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ పాలనలో మాట ఇచ్చి పేద ప్రజలను మోసం చేశారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్