వనపర్తి: ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి

70చూసినవారు
వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకురాలు, వాయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ ఘనంగా నిర్వహించిన జన్మదినం వేడుకల్లో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్తు కాలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న నాయకురాలు ప్రియాంక గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్